Saturday, May 16, 2020

మామవతు శ్రీ సరస్వతి _Mamavathu Sri Saraswathi Lyrics in Telugu

                              మామవతు శ్రీ  సరస్వతి 



రచన : మైసూరు  వాసుదేవాచార్య 
భాష :సంస్కృత 
రాగం : హిందోళం
 తాళం: ఆది

ఆరోహణ     : స రి2 గ1 మ1 ప ద1  ని3 స 
అవరోహణ : స ని3 ద1 ప మ1 గ2 రి2 స 


    పల్లవి

మామవతు శ్రీ సరస్వతి 
కామకోటి  పీఠ నివాసిని 

అనుపల్లవి

కోమలాకర సరోజ ధృతవీణా 
సీమాతీత  వర వాగ్విభూషణ 

 చరణం
 రాజాధి రాజా   పూజిత చరణ
రాజీవ  నయన రమణీయ వదన 
సుజన మనోరథ పూరణ చతుర నిజగల శోభిత మణిమయ హర 
అజభవ వందిత వాసుదేవ చరణార్పిత సకల వేద సార  
                                                  !!మామవతు!!

Tuesday, May 12, 2020

సామజ వర గమనా -త్యాగరాజ కృతి Tyagaraja Kriti_ Samaja _Vara_ Gamana Lyrics in Teugu

               

                       సామజ వరగమనా -త్యాగరాజ కృతి 







రచన :త్యాగరాజ 
భాష : తెలుగు 
రాగం  : హిందోళం   
తాళం : ఆది 
                           
ఆరోహణం    :       స   గ2  మ2  ద2   ని2  స 
అవరోహణం :        స  ని2 ద1  మ1 గ2  స 

                                                      పల్లవి

                  సామజ వర గమన సాధు హృత్
సారసాబ్జ పాల కాలాతీత విఖ్యాత
  అను పల్లవి 
సామ నిగమజ సుధా మయ గాన విచక్షణ
గుణ శీల దయాలవాల మాం పాలయ
చరణం 
వేద శిరో మాతృజ సప్త స్వర
నాదాచల దీప స్వీకృత
యాదవ కుల మురళీ వాదన
వినోద మోహన కర త్యాగరాజ వందనీయ
!!సామజ!!

బంటురీతి కొలువు - త్యాగరాజ కృతి Tyagaraja Krithi_ Bantureethi_Koluvu Lyrics in Telugu

                 బంటురీతి కొలువు - త్యాగరాజ కృతి 

శ్రీ రామా 
                                       

రచన :త్యాగరాజ 
భాష : తెలుగు 
రాగం  : హంసనాదం  
తాళం : ఆది 
                           
ఆరోహణం:  స రి2 మ2  ప ని3 స 
అవరోహణం : స ని3 ప మ2 రి2 స 

   పల్లవి
   బంటు రీతి కొలువీయ వయ్య రామ
                 
       అను పల్లవి 

తుంట వింటి వాని మొదలైన
మదాదుల బట్టి నేల కూలజేయు నిజ
                    
చరణం 
రోమాంచమనే  ఘన కంచుకము
రామ భక్తుడనే  ముద్రబిల్లయు
రామ నామమనే  వర ఖఢ్గమి
వి రాజిల్లునయ్య  త్యాగరాజునికే
!!బంటు రీతి!!

Sunday, May 10, 2020

త్యాగరాజ కృతి _మరుగేలరా ఓ రాఘవ Tyagaraja Krithi- Marugelara _O Raghava Lyrics in Telugu

                       త్యాగరాజ కృతి  _ మరుగేలరా ఓ రాఘవ



రచన :త్యాగరాజ 
భాష : తెలుగు 
రాగం  : జయంతశ్రీ 
తాళం : ఆది 

ఆరోహణం     :          స   గ2  మ1  ద1   ని2  స 
అవరోహణం :      స  ని2  ద1  మ1  ప  మ1  గ2  స 

పల్లవి  

మరుగేలరా ఓ రాఘవా

                                                       
 అను పల్లవి 

మరుగేల చరా చర రూప 

                                                 

చరణం

పరాత్పర సూర్య సుధాకర లోచనా 


అన్ని నీ వనుచు అంతరంగమున


తిన్నగా వెదకి తెలుసుకొంటి నయ్య



నెన్నె గాని మదిని ఎన్నజాల నొరుల

నన్ను బ్రోవవయ్య త్యాగ రాజనుత    
                    
  !!మరుగేలరా !!

Friday, May 8, 2020

త్యాగరాజ కృతి _మా కేలరా విచారము Tyagaraja Kriti_ Maakelara Vicharamu_Lyrics in Telugu

                     త్యాగరాజ  కృతి -మా కేలరా  విచారము 



రచన : త్యాగరాజ 
భాష: తెలుగు 
తాళం : దేశాది 
రాగం : రవి చంద్రిక 


పల్లవి :

మాకేలరా  విచారము 
మరుగన్న  శ్రీ రామ చంద్ర 

 అనుపల్లవి :

సాకేత వాస   కుమార 
సద్భక్త  మందార శ్రీ-కర 

చరణం : 
జత కూర్చి నాటక   సూత్రమును 
జగమెల్ల మెచ్చగా  కరముననిడి 
గతి తప్పక ఆడించేవు సుమీ 
నట త్యాగరాజ గిరీశ వినుత 


క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని _ Ksheerabdhi kanyakaku Sri MahaLakshmikini _ Annamacharya Sankeertana_Lyrics In Telugu

         క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని



రచన : అన్నమాచార్య 
తాళం: ఆది 
భాష: తెలుగు 
రాగం: మాధ్యమావతి 

క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
నీరజాలయమున కు నీరాజనం

        నీరాజనం నీరాజనం


జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు 
నెలకొన్న కప్పురపు నీరాజనం

అలివేణి తురుమునకు హస్తకమలంబులకు 
నిలువుమాణిక్యముల నీరాజనం

                       ||క్షీరాబ్ధి ||

పగటు శ్రీవేంకటేశు పట్టపురాణియై 
నెగడు సతికళలకును నీరాజనం

జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల 
నిగుడు నిజ శోభనపు నీరాజనం
     నీరాజనం నీరాజనం
                       
||క్షీరాబ్ధి||



Monday, May 4, 2020

పోతన పద్యము _ పలికెడిది భాగవతమట - Pothana Padyamu_ Palikededi_Bhagavathamata

                
              పోతన పద్యము పలికెడిది భాగవతమట 





            ఈ పద్యము   "బమ్మెర పోతన " గారు  తెనుగించిన వేదవ్యాసుని   "భాగవతము " లోనిది . 
              ఒకసారి  శ్రీరాముడు పోతన గారి కి కలలో కనిపించి  శ్రీ మహాభాగవతాన్ని తెలుగు లో రాయమని అన్నారట . ఆ ఆనందంలో పోతన గారి నోటి నుండి వెలువడినది ఈ  అద్భుత పద్యము. 


    పలికెడిది భాగవతమట ,

పలికించు విభుండు రామభద్రుండట , నే  

బలికిన భవహారమగునట,

పలికెద, వేరొండు గాథ  బలుకగఁ  నేలా ?


భావము : నన్ను పలికించేవాడు పరమాత్మయే అయిన ఆ 
రామభద్రుడే కదా పలికితే కలిగే  ఫలం సంసారం అనే 
ఘోరమైన దుఃఖాన్ని పోగొట్టుకోవడమే అట. అటువంటి ఫలం
 సమకూరుతుండగా మరొకగాథను పలకవలసిన 
పనియేమున్నది. కాబట్టి భాగవత గాథనే పలికెదను.  


పోతన పద్యము - ఇందు గల డందులేడని Pothana Padyam _ InduGala DanduLedani


          పోతన పద్యము - ఇందు గల డందులేడని 




ఈ పద్యము   "బమ్మెర పోతన " గారు  తెనుగించిన వేదవ్యాసుని   "భాగవతము "లోనిది .  హిరణ్యకశిపుడు  ప్రహ్లాదుని  విష్ణుమూర్తి ఎక్కడ వున్నాడో  చూపించమని అడుగగా  చెప్పిన సందర్భం లోనిది . 

           ఇందు గల డందులేడని 

           సందేహము వలదు చక్రి సర్వోపగతుం 

           డెందెందు వెదకిచూచిన 

           నందండే కలదు దానవగ్రణీ  , వింటే   !!



భావము :  ప్రహ్లాదుడు , హిరణ్యకశిపునితో  ఇట్లనెను " తండ్రి  !  నీకు  ఆ విష్ణువు ఎక్కడ వున్నాడో  అనే అనుమానము వద్దు,యన సర్వాన్తర్యామి . ఇక్కడ అక్కడ అని కాదు ,నీవు ఎక్కడెక్కడ  వెతుకుతావో అక్కడ  ఉంటాడు.  "