పోతన పద్యము - ఇందు గల డందులేడని
ఈ పద్యము "బమ్మెర పోతన " గారు తెనుగించిన వేదవ్యాసుని "భాగవతము "లోనిది . హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని విష్ణుమూర్తి ఎక్కడ వున్నాడో చూపించమని అడుగగా చెప్పిన సందర్భం లోనిది .
ఇందు గల డందులేడని
సందేహము వలదు చక్రి సర్వోపగతుం
డెందెందు వెదకిచూచిన
నందండే కలదు దానవగ్రణీ , వింటే !!
భావము : ప్రహ్లాదుడు , హిరణ్యకశిపునితో ఇట్లనెను " తండ్రి ! నీకు ఆ విష్ణువు ఎక్కడ వున్నాడో అనే అనుమానము వద్దు,ఆయన సర్వాన్తర్యామి . ఇక్కడ అక్కడ అని కాదు ,నీవు ఎక్కడెక్కడ వెతుకుతావో అక్కడ ఉంటాడు. "
భావము : ప్రహ్లాదుడు , హిరణ్యకశిపునితో ఇట్లనెను " తండ్రి ! నీకు ఆ విష్ణువు ఎక్కడ వున్నాడో అనే అనుమానము వద్దు,ఆయన సర్వాన్తర్యామి . ఇక్కడ అక్కడ అని కాదు ,నీవు ఎక్కడెక్కడ వెతుకుతావో అక్కడ ఉంటాడు. "
Indu kala DaMdu lEDani
saMdEhamu valadu chakri sarvOpagatuM
DeMdeMdu vedaki choochina
naMdaMdE kalaDu daanavaagraNi viMTE
No comments:
Post a Comment