Monday, May 4, 2020

పోతన పద్యము _ పలికెడిది భాగవతమట - Pothana Padyamu_ Palikededi_Bhagavathamata

                
              పోతన పద్యము పలికెడిది భాగవతమట 





            ఈ పద్యము   "బమ్మెర పోతన " గారు  తెనుగించిన వేదవ్యాసుని   "భాగవతము " లోనిది . 
              ఒకసారి  శ్రీరాముడు పోతన గారి కి కలలో కనిపించి  శ్రీ మహాభాగవతాన్ని తెలుగు లో రాయమని అన్నారట . ఆ ఆనందంలో పోతన గారి నోటి నుండి వెలువడినది ఈ  అద్భుత పద్యము. 


    పలికెడిది భాగవతమట ,

పలికించు విభుండు రామభద్రుండట , నే  

బలికిన భవహారమగునట,

పలికెద, వేరొండు గాథ  బలుకగఁ  నేలా ?


భావము : నన్ను పలికించేవాడు పరమాత్మయే అయిన ఆ 
రామభద్రుడే కదా పలికితే కలిగే  ఫలం సంసారం అనే 
ఘోరమైన దుఃఖాన్ని పోగొట్టుకోవడమే అట. అటువంటి ఫలం
 సమకూరుతుండగా మరొకగాథను పలకవలసిన 
పనియేమున్నది. కాబట్టి భాగవత గాథనే పలికెదను.  




No comments:

Post a Comment