Monday, June 22, 2020

రామ చరణం -- శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి Rama Charanam By Devulapalli Krishna Sastry Lyrics in Telugu

               దేవులపల్లి  కృష్ణ శాస్త్రి రచన -  రామ చరణం  


రచన : శ్రీ దేవులపల్లి  కృష్ణ శాస్త్రి
భాష : తెలుఁగు 




దేవులపల్లి  వెంకట కృష్ణ శాస్త్రి గారు తెలుగు లో భావ కవిత కు ఆద్యుడు.  ప్రసిద్ధ  తెలుగు కవి మరియు  ప్రముఖ తెలుగు సినిమా రచయిత.కృష్ణశాస్త్రిగారు తూర్పుగోదావరిజిల్లా, పిఠాపురం దగ్గర రావువారి చంద్రాపురం లో 1897 లో జన్మించారు.కృష్ణ పక్షం , ఊర్వశిప్రవాసం ఈయన ముఖ్య  రచనలు . 
 


పల్లవి :
 
రామ చరణం రామ చరణం
రామ చరణం మాకు శరణం
మాకు చాలును మౌని మస్తక
భూషణం
శ్రీరామ చరణం
మాకు చాలును మౌని మస్తక
భూషణం శ్రీరామ చరణం
                                       రామ చరణం
 
చరణం 1. రాగయై ఈ బ్రతుకు చెడి
రాయైన వేళల రామ చరణం
మూగయై పెంధూళి పడి
మ్రోడైన వేళల రామ చరణం
     ప్రాణ మీయగ రామ చరణం
            పటిమ నీయగ రామ చరణం 
మాకు చాలును తెరయు
మరణము రాకపోతే రామ చరణం

                                                                                             రామ చరణం

చరణం 2. కోతియై ఈ మనసు నిలకడ
కోలుపోతే రామ చరణం
సేతువై భవ జలధి తారణ
హేతువైతే రామ చరణం
ఏడుగడ శ్రీరామ చరణం
తోడుపడ శ్రీరామ చరణం
మాకు చాలును ముక్తి సౌధ
కారణం శ్రీరామ చరణం

                                            రామ చరణం
 
చరణం 3. నావలో తానుండి మము
నట్టేట నడిపే రామ చరణం
త్రోవలో కారడవిలో తొత్తోడ
నడిపే రామ చరణం
నావ యయితే రామ చరణం
త్రోవ యయితే రామ చరణం
మాకు చాలును వైకుంఠ మందిర
తోరణం శ్రీరామ చరణం

                                        రామ చరణం
 
చరణం 4. దారువునకును రాజ్యపూర్వక
దర్పమిచ్చే రామ చరణం
భీరువునకును అరిమి దీర్చే
వీర మిచ్చే రామ చరణం
ప్రభుతనిచ్చే రామ చరణం
అభయమిచ్చే రామ చరణం
మాకు చాలు మహేంద్ర
వైభవ కారణం శ్రీరామ చరణం

                                 రామ చరణం

Wednesday, June 10, 2020

స్వాగతం కృష్ణా--శరణాగతమ్ కృష్ణ Swagatham Krishna Song Lyrics in Telugu

స్వాగతం కృష్ణా--శరణాగతమ్ కృష్ణ


రాగం: మోహనం 
రచన: ఊత్తుకాడు  వెంకటసుబ్బ అయ్యర్ 
తాళం : ఆది 

ఆరోహణం : స రి2 గ3 ప ద2  స 
అవరోహణం : స ద2 ప గ3  రి2 స 

పల్లవి : మధురాపురి సదనా
మృదు వదనా మధుసూదన
ఇహ స్వాగతం కృష్ణా
శరణాగతమ్ కృష్ణ
అనుపల్లవి: 
భోగధాప్త  సులభ సుపుష్ప గంధ  కలభా 
కస్తూరి తిలక మహిమ మామ కాంతనంద గోపకంద
 !!స్వాగతం కృష్ణా!!
చరణం :
ముష్టికాసూర చాణూర మల్ల
మల్ల విశారద మధుసూదన
మర్దన కాళింగ నర్తన గోకుల రక్షణ సకల సులక్షణ దేవా
శిష్ట జనపాల సంకల్ప కల్ప కల్ప శతకోటి అసమపరాభవ
ధీర  ముని జన విహారమదన సుకుమార దైత్య సంహార దేవా
మధుర మధుర రతి సాహస సాహస వ్రజయువతీ జన మానస పూజిత 
 !!స్వాగతం కృష్ణా!!

గజేంద్ర మోక్షం - పోతన భాగవత సుధా - సిరికిం జెప్పడు Gajendra Moksham

                       గజేంద్ర మోక్షం - పోతన భాగవత సుధా - సిరికిం  జెప్పడు 






           సిరికిం  జెప్పడు శంఖ చక్ర యుగముం చేదోయి సంధీంప డే 

         పరివారంబును జీర డభ్రగపతిన్ మన్నింపడా కర్ణికాం

తర ధమ్మి ల్లము జక్కనొత్తడు వివాదప్రోద్ధత  శ్రీ కూచో

 పరి  చేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహియై !!

తాత్పర్యము : 

 శ్రీ మన్నారాయణుడు గజేంద్రుని కాపాడే తొందరలో తన ప్రియసఖి అయిన
 
లక్ష్మి దేవి కి కూడా చెప్పకుండా  శంఖ ,చక్ర గదాది  ఆయుధములను చేపట్టక
 
 తన పరివారమును పిలువక తన వాహనమైన గరుడుని కూడా అధిరోహించక 

వెను వెంటనే  బయలుదేరాడని అర్ధం.  

పలుకే బంగారమాయేన - రామదాసు(కంచెర్ల గోపన్న ) కీర్తన PAluke Bangaramayena Song Lyrics in Telugu

                               

             పలుకే బంగారమాయేన - రామదాసు(కంచెర్ల గోపన్న ) కీర్తన 



 పల్లవి:        పలుకే  బంగారమాయెనా  కోదండపాణి 

చరణం 1:
                 పలుకే    బంగారమాయె  పిలిచినా పలుకవేమి 

                 కలలో   నీ     నామ స్మరణ మరువ చక్కని తండ్రి  

చరణం 2: 
                    ఇరువుగా ఇసుకలోన పొరలిన యుడుత భక్తికి 

                       కరుణించి బ్రోచితివని  నె ర నమ్మితిని  తండ్రి 

చరణం 3: 
                       రాతి  నాతిగా  జేసి భూతలమున  

              ప్రఖ్యాతి జెందితివని ప్రీతితో నె ర నమ్మితిని  తండ్రి

చరణం 4:
 
                 ఎంత వేడిన గాని సుంతైనా దయరాదు 

                  పంతము సేయ నేనేంతటి వాడను తండ్రి 

చరణం 5: 

          శరణాగత తత్రాణ బిరుదాంతుకుతుడవు గావా 

            కరుణించు భద్రాచల వరరామదాస పోషక