Monday, June 22, 2020

రామ చరణం -- శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి Rama Charanam By Devulapalli Krishna Sastry Lyrics in Telugu

               దేవులపల్లి  కృష్ణ శాస్త్రి రచన -  రామ చరణం  


రచన : శ్రీ దేవులపల్లి  కృష్ణ శాస్త్రి
భాష : తెలుఁగు 




దేవులపల్లి  వెంకట కృష్ణ శాస్త్రి గారు తెలుగు లో భావ కవిత కు ఆద్యుడు.  ప్రసిద్ధ  తెలుగు కవి మరియు  ప్రముఖ తెలుగు సినిమా రచయిత.కృష్ణశాస్త్రిగారు తూర్పుగోదావరిజిల్లా, పిఠాపురం దగ్గర రావువారి చంద్రాపురం లో 1897 లో జన్మించారు.కృష్ణ పక్షం , ఊర్వశిప్రవాసం ఈయన ముఖ్య  రచనలు . 
 


పల్లవి :
 
రామ చరణం రామ చరణం
రామ చరణం మాకు శరణం
మాకు చాలును మౌని మస్తక
భూషణం
శ్రీరామ చరణం
మాకు చాలును మౌని మస్తక
భూషణం శ్రీరామ చరణం
                                       రామ చరణం
 
చరణం 1. రాగయై ఈ బ్రతుకు చెడి
రాయైన వేళల రామ చరణం
మూగయై పెంధూళి పడి
మ్రోడైన వేళల రామ చరణం
     ప్రాణ మీయగ రామ చరణం
            పటిమ నీయగ రామ చరణం 
మాకు చాలును తెరయు
మరణము రాకపోతే రామ చరణం

                                                                                             రామ చరణం

చరణం 2. కోతియై ఈ మనసు నిలకడ
కోలుపోతే రామ చరణం
సేతువై భవ జలధి తారణ
హేతువైతే రామ చరణం
ఏడుగడ శ్రీరామ చరణం
తోడుపడ శ్రీరామ చరణం
మాకు చాలును ముక్తి సౌధ
కారణం శ్రీరామ చరణం

                                            రామ చరణం
 
చరణం 3. నావలో తానుండి మము
నట్టేట నడిపే రామ చరణం
త్రోవలో కారడవిలో తొత్తోడ
నడిపే రామ చరణం
నావ యయితే రామ చరణం
త్రోవ యయితే రామ చరణం
మాకు చాలును వైకుంఠ మందిర
తోరణం శ్రీరామ చరణం

                                        రామ చరణం
 
చరణం 4. దారువునకును రాజ్యపూర్వక
దర్పమిచ్చే రామ చరణం
భీరువునకును అరిమి దీర్చే
వీర మిచ్చే రామ చరణం
ప్రభుతనిచ్చే రామ చరణం
అభయమిచ్చే రామ చరణం
మాకు చాలు మహేంద్ర
వైభవ కారణం శ్రీరామ చరణం

                                 రామ చరణం

No comments:

Post a Comment