రచన : శ్రీ త్యాగరాజ
భాష: తెలుగు
రాగం :మాధ్యమావతి
తాళం: ఆది
ఆరోహణం : స రి 2 మ 1 ప ని 2 స
అవరోహణం: స ని2 ప మ1 రి2 స
పల్లవి
నగుమోము గలవాని నా మనోహరుని
జగమేలు సూరుని జానకీ వరుని
చరణం 1
దేవాది దేవుని దివ్య సుందరుని
శ్రీ వాసు దేవుని సీత రాఘవుని
చరణం 2
సుజ్ఞాన నిధిని సోమసూర్య లోచనుని
అజ్ఞాన తమముననుచు భాస్కరుని
చరణం 3
నిర్మలాకారుని నిఖిలాఘ హరుని
ధర్మాది మోక్షంబు దయచేయు ఘనుని
చరణం 4
బోధతో పలుమారు పూజించి
నే -రాధింతు
శ్రీ త్యాగరాజ సన్నుతుని
No comments:
Post a Comment