Tuesday, July 14, 2020

సీత కల్యాణ వైభోగమే - శ్రీ త్యాగరాజ కృతి sEETHA KALYANA_ vIBHOGAME _Sri Tyagaraja krithi _Lyrics in Telugu

                          సీత కల్యాణ  వైభోగమే  - శ్రీ త్యాగరాజ కృతి 


రాగం: శంకరాభరణం 
భాష: తెలుగు 
తాళం : ఖండ లఘు 
రచన :  శ్రీ త్యాగరాజ

ఆరోహణం:  స రి2 గ3 మ1 ప ద2 ని3 స 

అవరోహణం: స  ని3 ద2  ప మ1   గ3 రి2 స 




 
పల్లవి 
 
సీత కల్యాణ  వైభోగమే
            రామ కల్యాణ వైభోగమే
 
అనుపల్లవి 

పవనజ స్తుతి పాత్ర పావన చరిత్ర 
రవిసోమ వర నేత్ర రమణీయ గాత్ర 

చరణం 1
     సర్వలోకా ధార  సమరైక వీర 
గర్వ మానసదూర  కనకాగ ధీర 

చరణం 2

భక్తజన పరిపాల భరిత శరజాల 
భుక్తి ముక్తిదా లీల భూదేవ పాల  

చరణం 3

పామర సురభీమ  పరిపూర్ణ కామ 
శ్యామ జగదభి రామ సాకేత ధామ 

చరణం 4
నిగమాగమ విహార నిరుపమ శరీర 
నగధరాఘవిధర నతలోకాధారా 

చరణం 5

పరమేశ నుత గీత భవజలది  పోత 
తరణికుల సంజాత త్యాగరాజనుత 








No comments:

Post a Comment