Showing posts with label సిరికిం జెప్పడు -గజేంద్ర మోక్షం. Show all posts
Showing posts with label సిరికిం జెప్పడు -గజేంద్ర మోక్షం. Show all posts

Wednesday, June 10, 2020

గజేంద్ర మోక్షం - పోతన భాగవత సుధా - సిరికిం జెప్పడు Gajendra Moksham

                       గజేంద్ర మోక్షం - పోతన భాగవత సుధా - సిరికిం  జెప్పడు 






           సిరికిం  జెప్పడు శంఖ చక్ర యుగముం చేదోయి సంధీంప డే 

         పరివారంబును జీర డభ్రగపతిన్ మన్నింపడా కర్ణికాం

తర ధమ్మి ల్లము జక్కనొత్తడు వివాదప్రోద్ధత  శ్రీ కూచో

 పరి  చేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహియై !!

తాత్పర్యము : 

 శ్రీ మన్నారాయణుడు గజేంద్రుని కాపాడే తొందరలో తన ప్రియసఖి అయిన
 
లక్ష్మి దేవి కి కూడా చెప్పకుండా  శంఖ ,చక్ర గదాది  ఆయుధములను చేపట్టక
 
 తన పరివారమును పిలువక తన వాహనమైన గరుడుని కూడా అధిరోహించక 

వెను వెంటనే  బయలుదేరాడని అర్ధం.