త్యాగరాజ కృతి -మా కేలరా విచారము
రచన : త్యాగరాజ
భాష: తెలుగు
తాళం : దేశాది
రాగం : రవి చంద్రిక
పల్లవి :
మాకేలరా విచారము
మరుగన్న శ్రీ రామ చంద్ర
అనుపల్లవి :
సాకేత వాస కుమార
సద్భక్త మందార శ్రీ-కర
చరణం :
జత కూర్చి నాటక సూత్రమును
జగమెల్ల మెచ్చగా కరముననిడి
గతి తప్పక ఆడించేవు సుమీ
నట త్యాగరాజ గిరీశ వినుత