Showing posts with label క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని _ Ksheerabdhi kanyakaku Sri MahaLakshmikini _ Annamacharya Sankeertana_Lyrics In Telugu. Show all posts
Showing posts with label క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని _ Ksheerabdhi kanyakaku Sri MahaLakshmikini _ Annamacharya Sankeertana_Lyrics In Telugu. Show all posts

Friday, May 8, 2020

క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని _ Ksheerabdhi kanyakaku Sri MahaLakshmikini _ Annamacharya Sankeertana_Lyrics In Telugu

         క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని

రచన : అన్నమాచార్య 
తాళం: ఆది 
భాష: తెలుగు 
రాగం: మాధ్యమావతి 

క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
నీరజాలయమున కు నీరాజనం

        నీరాజనం నీరాజనం

జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు 
నెలకొన్న కప్పురపు నీరాజనం

అలివేణి తురుమునకు హస్తకమలంబులకు 
నిలువుమాణిక్యముల నీరాజనం

                       ||క్షీరాబ్ధి ||

పగటు శ్రీవేంకటేశు పట్టపురాణియై 
నెగడు సతికళలకును నీరాజనం

జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల 
నిగుడు నిజ శోభనపు నీరాజనం
     నీరాజనం నీరాజనం
                       
||క్షీరాబ్ధి||