భావయామి గోపాలబాలం - శ్రీ అన్నమాచార్య కీర్తన
రాగం: యమునా కళ్యాణి
తాళం : ఖండ
రచన: శ్రీ అన్నమాచార్య
భాష : తెలుగు
పల్లవి:
భావయామి గోపాల బాలం మన
సేవితం తత్పదం చింతయేయం సదా
చరణం 1
కటి ఘటిత మేఖలా ఖచిత మణిఘంటికా
పటల నినదేనా విభ్రాజమానం
కుటిలపదఘటిత సంకుల శింజితేనతం
చటులనాటనా సముజ్వల విలాసం
చరణం 2
నిరత కరకలిత నవనీతం బ్రహ్మాది
సురనికర భావన శోభిత పదం
తిరువేంకటాచలస్థితమ్ మనుపమమ్ హరిం
పరమపురుషం గోపాల బాలం
------------
