Wednesday, July 15, 2020

భో శంభో శివ శంభో _శ్రీ దయానంద సరస్వతి _Bho Shambo _Siva Shambo Lyrics in Telugu


                                                 భో శంభో శివ శంభో 


రాగం: రేవతి
తాళం : ఆది 
రచన : శ్రీ దయానంద సరస్వతి 
భాష: సంస్కృతము  




భో శంభో శివ శంభో స్వయంభో 
శివ శంభో స్వయంభో 

గంగాధర శంకర కరుణాకర 
మామవ భావ సాగర తారక 

నిర్గుణ పరబ్రహ్మ స్వరూప 
గమా గమా భూత ప్రపంచ రహిత 
నిజ గుహ నిహిత నితాంత అనంత
 ఆనంద అతిశయ  అక్షయ  లింగ


ధిమిత ధిమిత ధిమి ధిమికిట కిటతొం 
తొం తొం తిమికిట తరకిట కిటతొం
మతంగ మునివర వందిత ఈశా 
సర్వ దిగంబర వేష్టిత వేశా 
నిత్య నిరంజనా నిత్య నటేశ 
ఇషా సబేశా సర్వేశా 
భో శంభో శివ శంభో స్వయంభో 

 
                                            ------------------------------------------------------------
 

Tuesday, July 14, 2020

బ్రోచేవారెవరురా నిను వినా _ శ్రీ మైసూరు వాసుదేవాచార్య రచన _ Brochevarevarura _ninuvina _Lyrics inTelugu






బ్రోచేవారెవరురా నిను వినా

తాళం : ఆది
భాష: తెలుగు
రాగం : ఖమాస్ హరి కాంభోజి 28 మేళ కర్త జన్యం
రచన : శ్రీ మైసూరు వాసుదేవాచార్య

ఆరోహణం : స మ 1 గ3 మ1 ని2 ద2 ని2 ప ద 2 ని2 స
అవరోహణం: స ని2 ద 2 ప మ1 గ3 రి3 స



                                                   పల్లవి 


బ్రోచేవారెవరురా  నిను విన రఘువరా  నను 

నీ  చరణాంబుజమును  నే విడజాల కరుణాలవాల 



అనుపల్లవి

ఓ చతురననాది వందిత నీదు పరాకేలనయ్యా
నీ చరితములు
పొగడలేని నా చింతదీర్చి వరములిచ్చి వేగమే నన్ను



చరణం

సీతాపతి నాపై నీకభిమానము లేదా వాతాత్మజార్చిత
పద నామొరలను వినరాదా ఆతురముగా కరిరాజుని
బ్రోచిన వాసుదేవుడే నీవు గదా నా పాతకమెల్ల పోగొట్టి గట్టిగా నా చేయి బట్టి విడువక

సీత కల్యాణ వైభోగమే - శ్రీ త్యాగరాజ కృతి sEETHA KALYANA_ vIBHOGAME _Sri Tyagaraja krithi _Lyrics in Telugu

                          సీత కల్యాణ  వైభోగమే  - శ్రీ త్యాగరాజ కృతి 


రాగం: శంకరాభరణం 
భాష: తెలుగు 
తాళం : ఖండ లఘు 
రచన :  శ్రీ త్యాగరాజ

ఆరోహణం:  స రి2 గ3 మ1 ప ద2 ని3 స 

అవరోహణం: స  ని3 ద2  ప మ1   గ3 రి2 స 




 
పల్లవి 
 
సీత కల్యాణ  వైభోగమే
            రామ కల్యాణ వైభోగమే
 
అనుపల్లవి 

పవనజ స్తుతి పాత్ర పావన చరిత్ర 
రవిసోమ వర నేత్ర రమణీయ గాత్ర 

చరణం 1
     సర్వలోకా ధార  సమరైక వీర 
గర్వ మానసదూర  కనకాగ ధీర 

చరణం 2

భక్తజన పరిపాల భరిత శరజాల 
భుక్తి ముక్తిదా లీల భూదేవ పాల  

చరణం 3

పామర సురభీమ  పరిపూర్ణ కామ 
శ్యామ జగదభి రామ సాకేత ధామ 

చరణం 4
నిగమాగమ విహార నిరుపమ శరీర 
నగధరాఘవిధర నతలోకాధారా 

చరణం 5

పరమేశ నుత గీత భవజలది  పోత 
తరణికుల సంజాత త్యాగరాజనుత 



Sunday, July 12, 2020

భావయామి గోపాలబాలం - శ్రీ అన్నమాచార్య కీర్తన Bhavayami_GopalaBalam_ Lyrics In Telugu

                             భావయామి గోపాలబాలం - శ్రీ అన్నమాచార్య కీర్తన 

రాగం: యమునా కళ్యాణి 
తాళం : ఖండ 
రచన: శ్రీ అన్నమాచార్య
భాష : తెలుగు 



పల్లవి:

భావయామి గోపాల బాలం  మన 
సేవితం  తత్పదం  చింతయేయం సదా 

చరణం 1

కటి ఘటిత మేఖలా ఖచిత మణిఘంటికా 
పటల  నినదేనా  విభ్రాజమానం 
కుటిలపదఘటిత సంకుల శింజితేనతం 
చటులనాటనా  సముజ్వల విలాసం  

చరణం 2

నిరత కరకలిత నవనీతం  బ్రహ్మాది 
సురనికర భావన శోభిత  పదం 
తిరువేంకటాచలస్థితమ్ మనుపమమ్ హరిం 
 పరమపురుషం  గోపాల బాలం
                  ------------


Saturday, July 11, 2020

ఓ పవనాత్మజ - అన్నమాచార్య కీర్తన oh Pavanathmaja _ annamacharya keerthana_ Lyrics in Telugu

                             ఓ పవనాత్మజ  - అన్నమాచార్య  కీర్తన 


రాగం: శ్రీ రాగం 
తాళం: ఆది 
రచన: శ్రీ అన్నమాచార్య 
భాష : తెలుగు 



పల్లవి 

 ఓ పవనాత్మజ ఓ ఘనుడా 
బాపు బాపనగా పరగితిగా 

చరణం 1

ఓ హనుమంతుడు ఉదయాచల
 నిర్వాహక నిజ సర్వ ప్రబలా 
దేహము మోచిన తెగువకు నిటువలె 
సాహస మిటువలే  చాటితిగా 

చరణం 2

ఓ రవి గ్రహణ ఓ దనుజాంతక 
మారులేక మతి మలసితిగా  
దారుణపు వినతా  తనయాదులు  గారవింప నిటు  కలిగితిగా 

చరణం 3

ఓ దశ ముఖ హర ఓ వేంకటపతి పాద సరోరుహ పాలకుడా 
 ఈ దేహముతో ఇన్ని లోకములు 
నీ దేహ మెక్క  నిలచితిగా 




పిబరే రామ రసం - Sada Siva Brahmendra _ Pibare Rama Rasam Lyrics In Telugu

                                                   పిబరే రామ రసం 

రాగం: యమన్  కళ్యాణి 
తాళం: ఆది 
భాష : సంస్కృతము 
రచన : సదాశివ బ్రహ్మేంద్ర 



   పల్లవి 

పిబరే రామరసం రసనే పిబరే రామరసం

చరణం 1:

దూరీకృత పతాక సంసర్గమ్ 
పూరిత నానా విధ ఫల వర్గమ్ 

చరణం 2:

జనన మరణ భయ శొకవిదూరం
సకల శాస్త్ర నిగమాగమ సారం

చరణం 3:

పరిపాలిత సరసిజ గర్భాండం 
పరమ పవిత్రీకృత పాషాండమ్ 

చరణం 4:

శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం
సుఖ శౌనక కౌశిక ముఖ పీఠం 



Sunday, July 5, 2020

నగుమోము గలవాని - త్యాగరాజ కృతి Nagumomu Ganavani tyagaraja kriti Lyrics in Telugu

                                     నగుమోము గలవాని -త్యాగరాజ కృతి   



రచన : శ్రీ త్యాగరాజ 
భాష: తెలుగు 
రాగం :మాధ్యమావతి  
తాళం: ఆది 

ఆరోహణం : స  రి 2 మ 1  ప ని 2 స 

అవరోహణం: స ని2 ప మ1 రి2 స 


         పల్లవి 
     నగుమోము గలవాని నా  మనోహరుని 
       జగమేలు  సూరుని  జానకీ వరుని 

      చరణం 1
            దేవాది దేవుని  దివ్య సుందరుని  
శ్రీ వాసు దేవుని   సీత రాఘవుని 


       చరణం 2

                సుజ్ఞాన నిధిని సోమసూర్య  లోచనుని 
అజ్ఞాన  తమముననుచు భాస్కరుని 

        చరణం 3

                    నిర్మలాకారుని నిఖిలాఘ హరుని 
ధర్మాది మోక్షంబు  దయచేయు ఘనుని 

        చరణం 4

                    బోధతో పలుమారు పూజించి
 నే -రాధింతు  
                            శ్రీ త్యాగరాజ సన్నుతుని